టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కి్స్తున్న లేటెస్ట్ చిత్రం ‘యుఫోరియా’ అనౌన్స్‌మెంట్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. ఇక ఈ సినిమాలో యంగ్ ట్యాలెంట్‌తో పాటు సీనియర్ స్టార్స్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు మేకర్స్. ‘యుఫోరియా’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ‘ఫ్లై హై’ అంటూ సాగే ఈ రాకింగ్ పాటను కాలభైరవ కంపోజ్ చేశాడు. కాలభైరవ, పృథ్వీ చంద్ర, గాయత్రి నటరాజన్ ఈ పాటను ఆలపించారు. ఇక ఈ పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.
కాగా, ఈ పాటను మే 24న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నీలిమ గుణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలో ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
