గ్రాండ్ గా వినాయక్ అతిధిగా వచ్చిన ‘సోలో బాయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

solo boy

తెలుగు స్మాల్ స్క్రీన్ గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. త్రిలోక్ సిద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. జుడా సంధ్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రఘు కుంచే, కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ తదితరులు హాజరై సోలో బాయ్ చిత్ర రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈ చిత్ర నిర్మాత సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. చాలా సాధారణ స్థాయి నుండి ఈరోజు నిర్మాతగా మారడానికి ఎంతో కష్టపడి సతీష్ ఇక్కడ వరకు వచ్చారు. ఈ చిత్రంలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి విజయం సాధించి సతీష్ ప్రయాణానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ… “చిత్ర ఈవెంట్ కు వచ్చిన అందరికీ నమస్కారం. నిర్మాత సతీష్ నాకు ఎంతోకాలంగా పరిచయం ఉన్నారు. దర్శకుడు కావాలని వచ్చి నిర్మాత అయ్యారు. ఆయన ఓటిటి ద్వారా విడుదల చేసిన బట్టల రామస్వామి బయోపిక్ ఎంతో మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆర్పి పట్నాయక్ గారితో కలిసి చేసిన కాఫీ విత్ ఎ కిల్లర్ ఎంతో పాపులర్ అయింది. ఇప్పుడు సోలో బాయ్ ద్వారా వెండిస్తల పైకి రానున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమాలు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ శ్వేత అవస్తి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. నాకు చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకునికి అలాగే చిత్ర బృందం అందరికీ నా థాంక్స్. మీ అందరితో పని చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. జులై 4వ తేదీన మా సినిమాను అందరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

మరో హీరోయిన్ రమ్య పసుపులేటి* మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బంధం అందరికీ థాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సినిమాలో గౌతం కృష్ణ పర్ఫామెన్స్ ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. నాకు మీరు ఎంతో కాలంగా తెలుసు. జూలై 4వ తేదీన ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అని తెలిపింది.

ఇక దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ… “సోలో బాయ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం. మా చిత్రం జూలై 4వ తేదీన ప్రేక్షకులు ముందుకు వస్తుంది. అందరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అన్ని రకాల జోనర్లు కనిపిస్తూ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది. గౌతమ్ కృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు. అలాగే ఇద్దరు హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అదేవిధంగా చిత్రంలో నటించిన ప్రతి నటీనటులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సినిమాలో పాటలు సంగీతం చాలా బాగా వచ్చాయి. సినిమా కోసం టెక్నికల్ గా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా డైరెక్షన్ టీమ్ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత గౌతమ్ కృష్ణకు ఎన్నో పెద్ద సినిమాలు వస్తాయి. నాకు ఈ సినిమా దర్శకత్వం చేసేందుకు అవకాశం ఇచ్చిన సెవెన్ హిల్స్ సతీష్ గారు ప్యాషన్ తో వచ్చి ఎంతో కష్టపడి చిత్ర నిర్మాణానికి సహాయపడుతూ ఉండే మనిషి. ప్రతి విషయంలోనూ ఎంతో సపోర్టుగా నిలిచారు. మంచి కంటెంట్ తో విజయం సాధించిపోతున్నామని మాకు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. మా నిర్మాత ఈ చిత్రం ద్వారా గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పరిశ్రమకు ఇంకెంతమందిని పరిశీలించాలని అనుకుంటున్నాను” అని తెలిపారు.

అలాగే నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ… “ఆ దేవుడికి, నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి, చిత్ర పరిశ్రమకు, మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు. నాకు చాలా ఎమోషనల్ గా ఉంది. చాలా చిన్నగా మొదలై ఇప్పుడు పెద్ద స్థాయిలో విడుదల కాబోతున్న సినిమా సోలో బాయ్. గౌతమ్ కృష్ణ నాకు తమ్ముడి లాంటివాడు. గౌతమ్ ఈ సినిమా కోసం ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఈ సినిమా కోసం ప్రతి విషయంలోనూ నాకు ఎంతో సపోర్టుగా నిలిచాడు. ఈ సినిమా గౌతం సినీ కెరియర్లో ఒక మంచి మైల్ స్టోన్ కావాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సోలో బాయ్ చిత్రం ప్రేక్షకులందరిదీ. నేను సినిమాకు చాలా కరెక్ట్ అయ్యాను. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు సోలో బాయ్ రాబోతుంది. చిత్ర టెక్నికల్ టీమ్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో నటించిన ఇతర నటినటులు అంతా చాలా బాగా చేశారు. మీడియా వారు ఈ చిత్రానికి బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఇక ఫైనల్ గా హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నేను బిగ్ బాస్ కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది. నాకు ఇటువంటి ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి సతీష్ గారు ఈ సినిమా మొదలుపెట్టారు. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. దర్శకుడు నవీన్ కుమార్ గారు ఎంతో కమిట్మెంట్తో ఉండే వ్యక్తి. చాలా తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను ఎంతో మంచి అవుట్ పుట్ తో తీసుకొచ్చాము. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకు పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఎంతో సీనియర్ నటినటులు మాతో నటించినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము. టెక్నికల్ టీం అంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సినిమాకు సపోర్టుగా వచ్చిన ప్రతి అతిధికి నా ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం అనేది చాలా పెద్ద విషయం. నేను దానిని ఒక సక్సెస్ లా చూస్తున్నాను. నన్ను ప్రశ్నించే వారికి ఇదేనా సమాధానం. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే మురళి నాయక గారి కుటుంబానికి మేము అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి ఇప్పటికే ఎంతోమంది సహాయం చేశారు, ఇంకా మీరు ఎందుకు ఇస్తున్నారు అని అన్నారు. మురళి నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు. ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడండి. జై హింద్” అంటూ ముగించారు.

Exit mobile version