తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కూలీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ అంచనాలు పెంచేలా ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ చిత్రం నుంచి ఆడియో లాంచ్ ఈవెంట్ మరియు ట్రైలర్ లాంచ్ చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు మేకర్స్. అయితే, ఈ ఈవెంట్ ప్రారంభం అయ్యే సమయానికే కూలీ ఆడియో సాంగ్స్ ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేశాయి. మొత్తం 8 పాటలు అందుబాటులో ఉండగా, వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అనిరుధ్ సంగీతానికి మరోసారి భారీ అప్రీషియేషన్ వస్తోంది.
దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూలీ పాటలు సందడి చేస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఈ పాటలు ఎలా చిత్రీకరించారో అని అభిమానులు మరింత ఆసక్తిగా చూస్తున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
