‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి నుంచి వస్తున్న మరో చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్‌ను దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని రివీల్ చేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ..‘‘మున్నా చాలా సరదాగా ఉంటాడు. చాలా కొద్ది మంది దర్శకులే కొత్తవాళ్లని పెట్టుకుని సినిమా చేస్తారు. నా మిత్రుడు మున్నా కష్టానికి తగిన ఫలితం రావాలి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. మొయిన్ 15 ఏళ్ల క్రితమే హీరో అవుతా అని చెప్పాడు. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు పరిచయం ఉన్నవాళ్లే. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో పాటలు, కథ అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. బ్యాడ్ గాళ్స్ అంటున్నా కానీ వాళ్లు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఫ్యామిలీ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం.’’ అని అన్నారు.
డైరెక్టర్ మున్నా మాట్లాడుతూ..‘‘బాహుబలిలో బిడ్డను కాపాడే చేయిలా నాకు చేయందించింది మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. ఈ స్టోరీకి ఎంతోమంది అమ్మాయిల కథలు స్ఫూర్తినిచ్చాయి. అమ్మాయిలకు పెళ్లి ముందు ఉండే ఫ్రీడం పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలా మంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశా. నేను, నా క్లాస్‌మేట్స్ డబ్బులు పెట్టి ఈ సినిమా తీశాం. బాగా చదువుకున్నవాళ్ల కథ ఇది. అమ్మాయిలను పేరెంట్స్ భయంతో కాదు ధైర్యంతో పెంచాలి అని చెప్పే కథ ఇది. అమ్మాయిలను అమ్మోరులా పెంచాలి. ట్రైలర్, సాంగ్స్ నచ్చితేనే మా సినిమా చూడండి. ఈ నలుగురు అమ్మాయిలను లైఫ్‌లో మర్చిపోలేను. రేణూ దేశాయ్ గారు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. నెక్ట్స్ ఈవెంట్స్‌లో ఆమె పాల్గొంటారు.’’ అని అన్నారు.
ఇక ఈ ఈవెంట్‌లో దర్శకుడు శివ నిర్వాణ, కమెడియన్ భద్రం, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్, ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి, నటుడు మొయిన్, నటుడు సూర్య తదితరులు పాల్గొని మాట్లాడారు.
