టాక్.. ‘వార్ 2’ మొదలైన ఇన్ని నిమిషాలకే తారక్ ఎంట్రీ!

War 2 2

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న చిత్రమే “వార్ 2”. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేసిన ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉండనుండగా తన పాత్రపై అనేక రూమర్స్ ఉన్నాయి.

సినిమా ఇంటర్వెల్ బ్లాక్ లో తన ఎంట్రీ ఉంటుంది అన్నట్టుగా వచ్చిన రూమర్స్ పై కూడా రీసెంట్ ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడారు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం వార్ 2 లో ఎన్టీఆర్ ఎంట్రీ సినిమా మొదలైన 20 నిమిషాలకే ఉంటుంది అని తెలుస్తుంది. అక్కడ నుంచి ఎన్టీఆర్, హృతిక్ ల నడుమ సన్నివేశాలు మంచి బ్యాలన్స్డ్ గా వెళ్తాయట. సో వార్ 2 విషయంలో ఎన్టీఆర్ అభిమానులు ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదు అని చెప్పవచ్చు.

Exit mobile version