పిక్ టాక్ : ‘కూలీ’ ఫస్ట్ డే ఫస్ట్ షో.. ఫ్యానిజం చూపెట్టిన ఓజి బ్యూటీ

Priyanka

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో తలైవా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇక కూలీ చిత్రాన్ని చూసేందుకు సాధారణ అభిమానులు మొదలుకొని సినీ స్టార్స్ వరకు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

రజినీకాంత్ సినిమా అంటే తమిళనాట ఓ పండుగ అనే చెప్పాలి. ఆయన సినిమాను చూసేందుకు కామన్ ఆడియన్స్‌తో పాటు సెలబ్రిటీలు సైతం థియేటర్లకు పరుగులు పెడుతుంటారు. నేడు రిలీజ్ అయిన ‘కూలీ’ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు కోలీవుడు స్టార్స్ అందరూ థియేటర్లకు పరుగులు పెట్టారు. ఇందులో అందాల భామ ప్రియాంక మోహన్ కూడా ఉంది.

తలైవా డై హార్డ్ ఫ్యాన్ అయిన ప్రియాంక కూలీ చిత్రాన్ని చూసేందుకు తాను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఇక ఆమె థియేటర్‌లో సందడి చేయడంతో రజినీ ఫ్యాన్స్‌తో పాటు ఆమె ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఆమె కూలీ చిత్రానికి సంబంధించి ఓ స్కెచ్ పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కూలీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

Exit mobile version