మన టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు హీరో గానే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో విలన్ గా నెగిటివ్ పాత్రలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా సైమన్ అంటూ కూలీ సినిమాలో పలకరించారు. ఇక ఈ చిత్రం తర్వాత నాగార్జున తన 100వ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అనేవి ఇప్పటికీ అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. అయితే ఈ సినిమాపై పలు ఊహాగానాలు ఉన్నాయి కానీ ఫైనల్ గా నాగార్జున తన బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ పై ఓపెన్ అయ్యారు. ఈ సినిమాలో తమిళ దర్శకుడు కార్తీ అనే అతను వర్క్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
అంతే కాకుండా చాలా నెలల నుంచి ఈ సినిమా పనులు జరుగుతున్నాయి అని ఈ సినిమాలో కూడా మంచి యాక్షన్ ఇంకా ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలిపారు. ఇప్పుడు కూలీ తర్వాత వెంటనే స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ ఇదే అని జగపతిబాబు టాక్ షోలో పాల్గొన్న కింగ్ నాగార్జున రివీల్ చేశారు.
