OG : తొలి ప్రీమియర్ షో ఇక్కడే..!

OG Movie

టాలీవుడ్ ప్రేక్షకులను ఊపేస్తున్న ‘ఓజీ’ మేనియా యావత్ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమా ప్రీమియర్ షోను చూసేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షో పడుతుంది. అయితే, ఓజీ చిత్రం తొలి ప్రీమియర్ షో ఎక్కడ పడుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కాగా, బీహార్‌లోని పాట్నాలో ఓజీ ప్రీమియర్ ఫస్ట్ షో రాత్రి 9.15 గంటలకు పడుతుంది.

దీంతో పాట్నా అభిమానులు తమ అభిమాన హీరో సినిమాను మిగతా ఫ్యాన్స్ కంటే ముందే వీక్షించే ఛాన్స్ దొరికినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version