పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘ది రాజా సాబ్’ (The Raja Saab). దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ సాలిడ్ హారర్ ఎంటర్టైనర్ కి ఇప్పుడు జనవరిలో రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 8 ప్రీమియర్స్ తో పడబోతోంది. అయితే యూఎస్ మార్కెట్ లో కూడా ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యి మంచి బుకింగ్స్ రిజిస్టర్ అవుతున్నాయి. కానీ ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం ది రాజా సాబ్ కి హాలీవుడ్ భారీ సినిమా అవతార్ 3 ఎఫెక్ట్ పడింది.
రాజాసాబ్ పై అవతార్ 3 ఎఫెక్ట్..
మన ఇండియన్ సినిమా నుంచి పలు చిత్రాలు ఐమ్యాక్స్ వెర్షన్ లో తెరకెక్కించకపోయినప్పటికీ ఆ ఫార్మాట్ లో అప్డేట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ గత సినిమాలు కూడా విడుదల అయ్యాయి. కానీ ఇపుడు రాజా సాబ్ (Raja Saab USA Release) కి అవతార్ 3 (Avatar The Fire and Ash) అడ్డంకిగా నిలిచింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ వారు కూడా అవతార్ 3 కే మూడు నుంచి నాలుగు వారాలు పాటు అగ్రిమెంట్ లు జరుపుకోవడం మూలాన రాజా సాబ్ ఐమ్యాక్స్ రిలీజ్ కోసం ఎవరూ ఆశించవద్దని క్లారిటీ ఇచ్చేసారు.
ఐమ్యాక్స్ కాకుండా ఇంకెందులో బెస్ట్ ఎక్స్ పీరియన్స్?
ఐమ్యాక్స్ కాకుండా యూఎస్ మార్కెట్ లో అయితే పిఎల్ఎఫ్ (PLF) అలాగే డిబాక్స్ (DBOX) సహా ఇతర బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ఫార్మాట్ లలో దింపేందుకు చూస్తున్నామని చెబుతున్నారు.
Due to the exclusive 4-week contract between #Avatar3 and IMAX, @IMAX is unable to support #TheRajaSaab. So there will be no IMAX format for this film.
Grab all available PLF, DBOX, and other specialty formats. Even those formats are tied up with Avatar 3 for 4 weeks, but as…
— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 5, 2025