‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై రచ్చ!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశిఖన్నా అలాగే శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కోసమే ఓ రేంజ్ లో టాలీవుడ్ వర్గాల్లో రచ్చ నడుస్తోంది. ఈ సినిమాని మొదట మేకర్స్ ఏప్రిల్ లో ప్లాన్ చేస్తున్నట్టు స్వయంగా తెలిపారు.

కానీ సడన్ గా సోషల్ మీడియాలో మార్చ్ నెల డేట్స్ ఊపందుకున్నాయి. ఇలా మార్చ్ 19 లేదా 26 డేట్స్ లో ఉస్తాద్ వస్తాడు అంటూ పలు రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఏది నిజమైన కూడా భారీ క్లాష్ ఉంటుంది అని చెప్పాలి. 19 అయితే టాక్సిక్ ఉంటుంది. 26 అయితే ది ప్యారడైజ్ ఇంకా పెద్ది లు ఉన్నాయి. సో వీటిలో ఏ డేట్ లో సినిమా వస్తుందో వేచి చూడాలి.

Exit mobile version