ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ లవ్ డ్రామా.. ఎందులో అంటే

రీసెంట్ గా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యిన చిత్రాల్లో హర్షిత్ రెడ్డి, స్నేహ మణి మేఘాలై హీరో హీరోయిన్స్ గా దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించిన ఎమోషనల్ చిత్రం “దీవానా” కూడా ఒకటి. మంచి ఎమోషనల్ ప్రేమ కథలను ఇష్టపడే వారికి ఎంతగానో నచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే నిన్ననే ఈ సినిమా అందులో అందుబాటులోకి వచ్చేసింది. కానీ అది కేవలం గోల్డ్ వినియోగదారులకి మాత్రమే. నేటి నుంచి సాధారణ సబ్ స్క్రైబర్ లకు కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి ఈశ్వర్ చంద్ సంగీతం అందించారు అలాగే అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి లు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version