అక్కడ ర్యాంపేజ్ మొదలెట్టిన ‘రాజాసాబ్’.. అప్పుడు ఆ మార్క్ క్రాస్..!

The-raja-saab

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీగా రూపొందుతోంది. 2026 జనవరి 9న ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన తొలి సింగిల్ ‘రెబల్ సాబ్’ మంచి హైప్‌ను తీసుకురాగా, రెండో పాటను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. విడుదలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం ఉండగానే ఈ సినిమా బుకింగ్స్ ద్వారా 100K డాలర్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. ప్రమోషన్లు బలంగా సాగితే, ఓవర్సీస్ మార్కెట్‌లో మరింత ఊపు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

Exit mobile version