పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరక్కిస్తున్న అవైటెడ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు రెండో సాంగ్ కి సంబందించిన అప్డేట్ ని అందించారు. సహానా సహానా అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో మాత్రం అదిరింది అని చెప్పాలి.
కంప్లీట్ గా ప్రభాస్ నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ గా ఎక్స్ ప్రెస్ అవుతూ కనిపిస్తున్నాడు. ఫస్ట్ అంటే ఇప్పుడు వచ్చిన సాంగ్ లో కూడా డార్లింగ్ నుంచి మళ్ళీ వింటేజ్ ఓపెన్ ప్రభాస్ కనిపిస్తున్నాడు. ప్రభాస్ లుక్స్ కానీ తన డాన్స్ మూమెంట్స్ మంచి ప్లెజెంట్ గా ఇందులో కనిపిస్తున్నాయి. ఇక ఫుల్ సాంగ్ అయితే ఈ సాంగ్ ని మేకర్స్ డిసెంబర్ 17 సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకి లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి థమన్ సంగీతం అందించిన ఈ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.
ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
