ట్రైలర్ టాక్: అపోహలన్నీ పటాపంచలు చేసిన ‘రామాయణ’.. ఇప్పుడు మరిన్ని అంచనాలు

Ramayana Movie Telugu Trailer

ఇప్పుడు యావత్తు భారతదేశం సహా పాన్ వరల్డ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ‘రామాయణ’ అనే చెప్పాలి. రణబీర్ కపూర్, సాయి పల్లవి కాంబినేషన్ లో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి మొదట వచ్చిన టీజర్ గ్లింప్స్ కి షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే దానిని మించి మంచి విజువల్స్ ని ఆశించిన ట్రైలర్ కట్ ఎట్టకేలకి విడుదల అయ్యింది. మరి ఈ ట్రైలర్ మాత్రం చాలామంది అపోహలను పటాపంచలు చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన విజువల్స్ మరియు భారీతనంతో అసలు ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు, 8 సార్లు ఆస్కార్ విన్నింగ్ వి ఎఫ్ ఎక్స్ టీం తో చేసిన విజువల్స్ ఎలా ఉండాలో ఎట్టకేలకి ఆ రేంజ్ ట్రైలర్ కట్ ని మేకర్స్ విడుదల చేశారు.

మరి ఈ ట్రైలర్ లో మొదట యష్ పోషించిన రావణ పాత్ర క్రోధం, అహం తోనే భీకర యుద్ధ సన్నివేశాలతో మొదలై రాముడిపై కూడా అద్భుతమైన సన్నివేశాలు తీసుకెళ్తూ చూపించారు. యష్ పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తే రణబీర్ కపూర్ రాముడి లోని సౌమ్యాన్ని, వీరత్వాన్ని తెరపై ప్రకాశవంతంగా చూపించారు. అలానే తనపై వనవాసం, ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి.

అంతే కాకుండా సాయి పల్లవి విషయంలో కూడా చాలామందికి డౌట్స్ ఉండొచ్చు కానీ ఆమెని కూడా ఊహాతీతంగా దర్శకుడు ప్రెజెంట్ చేయడం బాగుంది. ఆమె లోని సున్నితమైన కోణాన్నే కాకుండా యుద్ధ నైపుణ్య సన్నివేశాలు కూడా చూపించినట్టు తెలుస్తుంది. ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ కూడా సూర్పనఖ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

ఇక విజువల్స్ అయితే ఈ సినిమాకి ఎలా కావాలో ఆ రేంజ్ లో భారీ లెవెల్లో చాలా నాచురల్ గా ప్రతీ ఫ్రేమ్ లో ప్లాన్ చేసుకున్నారు. ఒకటీ రెండు చోట్ల కొంచెం లో అనిపించాయి కానీ మిగతా ట్రైలర్ అంతా సూపర్బ్ గా ఉన్నాయి. ఇక హన్స్ జిమ్మర్, రెహమాన్ ల స్కోర్ కూడా అమోఘం. ఇలా మొత్తానికి ఒక పర్ఫెక్ట్ ట్రైలర్ తో మేకర్స్ ఇప్పుడు మరిన్ని అంచనాలు పెంచేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version