బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో సతీష్ కిలారు నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమా కోసం బాలయ్య కసరత్తులు మొదలుపెట్టారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ ఎపిసోడ్ కోసం బాలయ్య యంగ్ గెటప్ లో కనిపించాల్సి ఉంది. ఆ యంగ్ గెటప్ కోసం ప్రస్తుతం బాలయ్య తన లుక్ పై వర్కౌట్ చేస్తున్నారట. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో బాలయ్య యంగ్ గెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోందట.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కొంత హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ వుంటుందని, బాలకృష్ణ మహరాజుగా కనిపిస్తారు. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అన్నట్టు ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా ఆ మధ్య స్పందిస్తూ.. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ నటించనున్న 111 ప్రాజెక్ట్ ఇది
