Varanasi : ప్రాచీన యుద్ధవిద్యలో మహేష్ ట్రైనింగ్.. యాక్షన్ లవర్స్‌కు పండగే..!

Varanasi

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ గ్లోబ్ ట్రాటర్ చిత్రం ‘వారణాసి’(Varanasi) ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో మహేష్ బాబు(Mahesh Babu) గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ రుద్ర అనే పాత్రలో చేయబోయే వీరవిహారం ఎలా ఉంటుందో ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌తో పరిచయం చేశారు.

కలరిపయట్టులో మహేష్ ట్రైనింగ్..

అయితే, ఈ వారణాసి(Varanasi) సినిమా కోసం మహేష్ యుద్ధవిద్యను నేర్చుకున్నాడు. ఆయనకు ఈ యుద్ధవిద్యలో శిక్షణ ఇచ్చింది హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ. ఇందులో భాగంగా ఆయన మహేష్ బాబుకి కలరిపయట్టులో(Kalaripayattu) శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టులో మహేష్ గత ఏడాదిలోనే శిక్షణ తీసుకున్నాడని.. అయితే, ఈ విషయాన్ని సమయం వచ్చే వరకు ఎవరికీ చెప్పకూడదని చిత్ర యూనిట్ తనను కోరినట్లు హరికృష్ణ తెలిపారు.

యాక్షన్ లవర్స్‌కు పండగే..

మహేష్ బాబు(Mahesh Babu) కంటే తాను చిన్నవాడినని.. అయినా, తనకు ఆయన ఇచ్చే మర్యాద ఎప్పటికీ మర్చిపోలేనిదని హరికృష్ణ తెలిపారు. ఈ విద్యను అభ్యసించిన వారు శారీరకంగా, మానసికంగా పవర్‌ఫుల్‌గా ఉంటారని ఆయన తెలిపారు. తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరికృష్ణ ఈ విషయాలను పంచుకున్నారు. ఇక వారణాసిలో(Varanasi) మహేష్ చేయబోయే యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఊహించవచ్చు. యాక్షన్ లవర్స్‌కు మహేష్ ఈ చిత్రంతో అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయం. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని మహేష్ బాబుని చూసేందుకు అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version