‘మైసా’ గ్లింప్స్: నెవర్ బిఫోర్ లుక్‌లో రష్మిక.. పవర్ ప్యాక్డ్ రెబల్!

మైసా

‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో అమాయకమైన యువతిగా అలరించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రం ‘మైసా’ (Mysaa) కోసం ఊహించని అవతారంలో కనిపించింది. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న మైసా చిత్ర యాక్షన్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయింది. రష్మిక కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ మరియు ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో ఆమె కనిపిస్తుండటంతో, ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో రష్మిక లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒళ్లంతా రక్తం, తెగిపోయిన చేతి బేడీలు, చేతిలో గన్‌ పట్టుకుని ఒక గిరిజన యువతిగా ఆమె కనిపిస్తున్న తీరు తిరుగుబాటుకు నిదర్శనంగా ఉంది. గ్లింప్స్‌లో వినిపించే వాయిస్ ఓవర్ పాత్రలోని గాంభీర్యాన్ని పెంచగా, జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రాణం పోసింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే రష్మిక ఒక సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ రోల్‌తో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించబోతున్నట్లు అర్థమవుతోంది.

అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి రెబల్ అవతారంలో రష్మిక బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం చేస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version