ట్రైలర్ టాక్ : ‘ఐమ్ గేమ్’తో దుల్కర్ సల్మాన్ అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ధమాకా..1

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్-ఇండియా చిత్రం ‘ఐమ్ గేమ్’(I’m Game). ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అద్భుతమైన విజువల్స్, మైండ్-బ్లోయింగ్ ఛేజింగ్ సీన్లు, హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్సులతో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ మునుపెన్నడూ చూడని రీతిలో ఆల్ట్రా-స్టైలిష్ మరియు ఎంటర్‌టైనింగ్ మాస్ అవతార్‌తో అలరించాడు. వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై జోమ్ వర్గీస్, దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం, ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా నిలవనుంది. యాంటోని వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్, కతిర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సౌత్ ఇండియాలో 100కు పైగా లొకేషన్లలో షూట్ చేశారు.

ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జింషి ఖాలిద్ ఫొటోగ్రఫీ ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమా స్థాయిని మరింత పెంచేలా ఉన్నాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ఆగస్టు 20న ఓనం కానుకగా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version