రీసెంట్ గా బాలీవుడ్ నుంచి వచ్చిన ధురంధర్ (Dhurandhar) అనే సినిమా ఏ రకంగా సెన్సేషన్ ని సెట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది.
ఇక ఈ సినిమా కేవలం హిందీలోనే ఉన్నప్పటికీ రికార్డు వసూళ్లు కోపిల్లగొడుతున్న ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం కూడా చాలా మంది ఎదురు చూసారు. కానీ ఇది వస్తుందనే అనుకున్నారు కానీ పరిస్థితులు అటు ఇటు ఉండడం మూలాన ఇది రాలేదు. కానీ పార్ట్ 2 మాత్రం డెఫినెట్ గా తెలుగు రిలీజ్ కూడా ఉంటుందనే రూమర్ వచ్చింది. అయితే లేటెస్ట్ గా ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది అని తాజాగా బాలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి.
Dhurandhar 2 in PAN India Languages – పాన్ ఇండియా భాషల్లో ‘ధురంధర్ 2’
ధురంధర్ పార్ట్ 1 (Ranveer Singh Dhurandhar 2) పాన్ ఇండియా భాషల్లో రానప్పటికీ పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ బజ్ ని అయితే క్రియేట్ చేసింది. దీనితో మేకర్స్ హిందీ, తెలుగు, తమిళ్ ఇంకా కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.
ఒక్క భాషలో తప్ప మిగతా వాటిలో కష్టమేనా?
ధురంధర్ 1 (Dhurandhar) విడుదలై నెమ్మదిగా ఒక సంచలనంగా మారడం మొదలు మొదటిగా అధిక రెస్పాన్స్ వచ్చింది మన తెలుగు ఆడియెన్స్ నుంచి మాత్రమే. సో తెలుగులో ఇప్పుడు పార్ట్ 1 వచ్చినా మినిమమ్ వసూళ్లు వచ్చేస్తాయి. సో ఇలానే డైరెక్ట్ పార్ట్ 2 వచ్చినా మనవాళ్ళు మంచి ఓపెనింగ్స్ ఇవ్వడం గ్యారెంటీ. కానీ మేకర్స్ మిగతా భాషల్లో రిలీజ్ కి రిస్క్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఇప్పుడుకి కూడా తెలుగు మినహా మిగతా భాషల్లో పెద్దగా చర్చ నడవలేదు. సో తెలుగులో ఈ సినిమా సక్సెస్ అయినా మిగతా భాషల్లో మాత్రం కష్టమే అనుకోవాలి.
