లైనప్ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్!

ram-charan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా అలానే నెక్స్ట్ దర్శకుడు సుకుమార్ తో చేసే సినిమా వరకు ఓకే కానీ ఆ తర్వాత ఏంటి? అంటే ఫ్యాన్స్ సైడ్ నుంచి స్పందన వచ్చే పరిస్థితి లేదు.

కానీ చరణ్ తో ఉన్న తన కో స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్ లు మాత్రం సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకుంటున్నారు. ప్రభాస్ చేతిలో కూడా ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ రామ్ చరణ్ నుంచి మాత్రం నెక్స్ట్ సుకుమార్ సినిమా తర్వాత ఎవరితో చేస్తారు అనేది ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.

దీనితో తన లైనప్ విషయంలో ఫ్యాన్స్ ఇపుడు వర్రీ గానే ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనగరాజ్ అంటూ ఆ మధ్య కొన్ని రూమర్స్ వినిపించాయి కానీ అవి కూడా తర్వాత తేలిపోయాయి. మరి ఈ విషయంలో మాత్రం చరణ్ కొంచెం వెనుకబడ్డాడు అని చెప్పక తప్పదు.

Exit mobile version