తమిళ సినిమా దగ్గర ఉన్నటువంటి టాలెంటెడ్ స్టార్ హీరోస్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (VijaySethupathi) కూడా ఒకరు. మరి విజయ్ హీరోగా తన మొదటి తెలుగు సినిమా మన టాలీవుడ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ సేతుపతి మళ్ళీ కోలీవుడ్ లో బిజీగా మారాడు.
అయితే చాలా మందికి విజయ్ సేతుపతి అంటే ఒక సాఫ్ట్ అండ్ సింపుల్ మనిషి గానే పరిచయం కానీ ఫస్ట్ టైం తన వింత లుక్ తో తన మీద మినిమమ్ ఐడియా ఉన్న వారికి షాకిచ్చాడు అని చెప్పాలి. పూర్తిగా ఒక ఊహించని లుక్ కి తాను మారి లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమోలో కనిపించడంతో సదరు తమిళ జనమే ఖంగుతిన్నారు.
తమిళ కమెడియన్ రెడిన్ కింగ్స్లే గుర్తున్నాడుగా తన లుక్ లోకి విజయ్ సేతుపతి మారిపోవడం ఒకింత ఫన్ గా తన ఫాలోవర్స్ కి మాత్రం షాకింగ్ గా అనిపిస్తుంది. దీనితో తన కొత్త ఊహించని లుక్ మాత్రం వైరల్ గా మారింది. ఇక పూరి జగన్నాథ్ సినిమా తాలూకా టైటిల్, ఫస్ట్ లుక్ లు ఇంకా బయటకి రావాల్సి ఉంది.
#Day83 #Promo3 of #BiggBossTamil
Bigg Boss Tamil Season 9 – இன்று இரவு 9:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #BiggBossTamilSeason9 #OnnumePuriyala #BiggBossSeason9Tamil #BiggBoss9 #BiggBossSeason9 #VijaySethupathi #BiggBossTamil #BB9 #BiggBossSeason9 #VijayTV #VijayTelevision pic.twitter.com/0LC1iYum8W
— Vijay Television (@vijaytelevision) December 27, 2025
