సర్‌ప్రైజ్ : నవీన్ పొలిశెట్టి కోసం కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్..!

AAOR

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంతో నవీన్ పొలిశెట్టి మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్లో సైతం ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.

అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ సర్‌ప్రైజింగ్ విషయం బయటకి వచ్చింది. ఈ సినిమాకు కింగ్ అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించి ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నవీన్ పొలిశెట్టి సినిమాలో నాగ్ ఎలాంటి మాడ్యులేషన్‌తో వాయిస్ ఓవర్ ఇస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలో నాగ్ డబ్బింగ్ చెబుతున్నట్లు కనిపిస్తున్నాడు.

ఈ సర్‌ప్రైజ్ రివీల్‌తో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version