‘జన నాయగన్’.. ఆ విషయంలో కూడా రికార్డే..!

Jana Nayagan

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ అన్నీ అనుకున్నట్లు అయ్యి ఉంటే, తమిళనాడులో పండుగ వాతావరణం నిండిపోయేది. విజయ్ చివరి చిత్రంగా వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే రిలీజ్‌కు కొద్ది గంటల ముందే, సెన్సార్ సమస్యల కారణంగా సినిమాను వాయిదా వేశారు. బాక్సాఫీస్‌ను షేక్ చేయాల్సిన ఈ సినిమా వాయిదా పడటం అభిమానులకు పెద్ద నిరాశగా మారింది.

ఇక ఈ చిత్ర రిలీజ్ విషయం హైకోర్టు వరకు వెళ్లడంతో తీర్పు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. అయితే, ఇప్పటికే విదేశాల్లో, ఇండియాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సెన్సార్ పూర్తికాకముందే టికెట్లు అమ్ముడవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు.

వాయిదా ప్రకటనకు ముందు వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.60 కోట్ల ప్రీ-సేల్స్ జరగగా, నార్త్ అమెరికాలో మాత్రమే 4.2 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. ఇప్పుడు అన్ని టికెట్లు క్యాన్సిల్ చేసి రీఫండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఓ సినిమా వాయిదా పడటంతో ఇంత భారీ మొత్తాన్ని రీఫండ్ చేయడంతో ఇది కూడా ఓ రికార్డుగా మారింది. మరి ఈ చిత్రాన్ని మళ్లీ ఇంత మంచి డేట్ దొరుకుతుందా? అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందా? అన్న సందేహాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

Exit mobile version