వైవిధ్యమైన కథలతో అలరించే హీరో కార్తి, మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ మోహన్ రాజాతో చేతులు కలిపాడు. ‘తని ఒరువన్’, ‘గాడ్ ఫాదర్’ వంటి బ్లాక్‌బస్టర్లతో పేరుపొందిన మోహన్ రాజా కాంబినేషన్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ మొదలైంది.
ఈ విషయాన్ని నిర్మతాలు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ.. స్ఫూర్తిదాయకమైన హీరోయిజం, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఈ గ్రాండ్ అనౌన్స్‌మెంట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.
ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతోంది. ప్రస్తుతం కార్తి ‘సర్దార్ 2’ చేస్తుండగా, ఈ కొత్త మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
