హిట్‌లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడికి ఇప్పటివరకు పరాజయం అన్నదే లేదు. ‘పటాస్’ నుంచి ‘సంక్రాంతి వస్తున్నాం’ వరకు ఆయన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. తక్కువ బడ్జెట్‌లోనే వినోదభరితమైన హిట్ సినిమాలు ఇవ్వడం అనిల్ ప్రత్యేకత. అయితే అలాంటి దర్శకుడిని ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారని తెలుసా..?
పాన్ ఇండియా స్టార్లు అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఒక దశలో అనిల్ రావిపూడిని రిజెక్ట్ చేశారు. ఈ ఇద్దరు హీరోలకు అనిల్ కొన్నేళ్ల క్రితం కథలు వినిపించాడని, కానీ అవి అప్పట్లో వారికి నచ్చలేదని స్వయంగా అనిల్ వెల్లడించాడు. అప్పట్లో తాను కొత్త దర్శకుడిగా ఉండటం, కథలు వారి ఇమేజ్‌కు కనెక్ట్ కాకపోవడం కారణాలు కావచ్చని ఆయన చెప్పాడు.
భవిష్యత్తులో ఇద్దరి స్థాయికి తగ్గ బలమైన కథ సిద్ధమైతే మళ్లీ తప్పకుండా వారిని సంప్రదిస్తానని అనిల్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
