బ్రేక్ తీసుకుంటున్న ఎనర్జిటిక్ స్టార్.. కారణం అదేనా..?

Ram-Pothineni

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎంతో నమ్మకం పెట్టుకున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. స్వయంగా పాటలు రాసి, ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొన్నప్పటికీ ఈ చిత్రం అనుకున్న సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ ఫలితం టాలీవుడ్‌ను ఆశ్చర్యానికి గురిచేయగా, రామ్ తన పారితోషికం విషయంలో కూడా రాజీ పడాల్సి వచ్చింది.

ఈ పరాజయంతో రామ్ కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొత్త దర్శకుడు కిశోర్‌తో చేయాల్సిన తన నెక్స్ట్ చిత్రాన్ని సంక్రాంతికి ప్రకటించాల్సి ఉన్నా, ఇప్పుడు దాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం సినిమా బడ్జెట్‌ను తగ్గించడమే కాకుండా, స్క్రిప్ట్ విషయంలో రామ్ స్వయంగా మార్పులు చేస్తూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు, ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి సినిమా నిర్మించేందుకు రామ్ ఒక కొత్త కథను కూడా సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం తన తదుపరి అడుగుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న రామ్, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ప్రభావం నుండి కోలుకుని మళ్ళీ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు.

Exit mobile version