నితిన్ నెక్స్ట్ చిత్రానికి డైరెక్టర్ ఎవరో తెలుసా?

Nithiin

టాలీవుడ్ హీరో నితిన్(Nithiin) గతకొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు. ఆయన నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతుండటంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే, ఆయన ఆచితూచి తన నెక్స్ట్ ప్రాజెక్టులను ఓకే చేస్తున్నా, కొన్ని కారణాల వల్ల అవి కూడా వేరే హీరోలకు వెళ్లిపోతున్నాయి. ఇక మరికొన్ని సినిమాలను నితిన్ స్వయంగా దూరం చేసుకుంటున్నాడు.

‘ఇష్క్’ ఫేం విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ బాగా వినిపించింది. కానీ, ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఇక దర్శకుడు ఆదిత్య హాసన్ రూపొందిస్తున్న ‘ఎపిక్’ సినిమాలో కూడా ముందుగా నితిన్‌నే హీరోగా అనుకున్నారు. కానీ, ఆ సినిమా ఆనంద్ దేవరకొండ వద్దకు వెళ్లింది. ఇక వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ కూడా తొలుత నితిన్ హీరో అని అన్నారు. కానీ చివరకు దేవిశ్రీ ప్రసాద్ ఫైనల్ అయ్యాడు.

ఇలా వరుసగా ప్రాజెక్ట్‌లు నితిన్ చేజారిపోవడంతో ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ చిత్రాలను దర్శకుడు అంజి కె మణిపుత్ర డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. లేడీ డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వంలో కూడా ఓ సినిమాను లైన్‌లో పెట్టాడట నితిన్. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు చేస్తాడో వేచి చూడాలి.

Exit mobile version