మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Vara Prasad Garu) సినిమా సంక్రాంతికి స్పెషల్ గా రాబోతుంది. ఈ సినిమాపై భారీగా హైప్ ఉంది. ఇప్పటికే, చాలా ప్రాంతాల్లో టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కానీ, నైజాం ఏరియాలో ప్రీమియర్ షోల కోసం బుకింగ్లు ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ రాత్రి సినిమా చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో, పంపిణీ సంస్థ ప్రీమియర్ షో టిక్కెట్ల అమ్మకాలు ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం చేసింది. దీంతో, నైజాం ప్రీమియర్ టిక్కెట్ల కోసం ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు.
అన్నట్టు ఈ చిత్రం ఇప్పటికే కేవలం బుక్ మైషోలోనే 108 వేల టిక్కెట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు. సంక్రాంతికి మెయిన్ స్పెషల్ గా రాబోతుంది కూడా ఈ సినిమానే.
