చరణ్ ‘పెద్ది’ కోసం యూరప్ షెడ్యూల్ ?

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. జనవరి ఎండింగ్ లో బుచ్చిబాబు, యూరప్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడట. యూరప్ లో చరణ్ పై సాంగ్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అన్నట్టు సాంగ్ తో పాటు ఓ యాక్షన్ సీన్ ను కూడా షూట్ చేస్తారట.

కాగా ఈ సినిమా క్లైమాక్స్ ఓ భారీ ప్రమాదం కారణంగా హీరో పాత్రకి కాళ్ళు పోతాయని.. అయినప్పటికీ రన్నింగ్ లో హీరో ఛాంపియన్ అవుతాడని.. సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందట. బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్న‌మైందట. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి పెద్ది సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

Exit mobile version