క్లైమాక్స్ కోసం ‘పెద్ది’ హై ఆక్టేన్ యాక్షన్.. మామూలుగా ఉండదట..!

Peddi

మెగా పవర్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ (Peddi) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసుకుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పూర్తి రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

అయితే, ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో చిత్ర క్లైమాక్స్‌కు సంబంధించి హై ఆక్టేన్ యాక్షన్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ చేసే యాక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తు్న్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version