ప్రస్తుతం మన తెలుగు సినిమా నుంచి సంక్రాంతి హడావుడి మొదలైంది. భర్త మహాశయులకు, మన శంకర వరప్రసాద్ అలాగే రాజా సాబ్ సినిమాలు ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఇక ఈ మూడు చిత్రాలు కాకుండా ఇంకో రెండు సినిమాలు రేపు రాబోతున్నాయి. అయితే ఈ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ కూడా ఒకటి.
ప్రమోషనల్ కంటెంట్ తో ఆల్రెడీ మంచి బజ్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాకి ఏపీలో హైక్ లు అందించడం చర్చగా మారింది. పెద్ద పెద్ద సినిమాలకి అయితే ఓకే అనుకోవచ్చు కానీ మరీ నవీన్ పొలిశెట్టి సినిమాకి కూడా హైక్స్ ఎందుకు అని భావించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే దీనిపై నిర్మాత నాగవంశీ అసలు క్లారిటీ అందించారు.
ఇప్పుడు ఉన్న సినిమాల్లో తమది మిడ్ రేంజ్ సినిమా అని పైగా థియేటర్స్ కూడా సరిగ్గా దొరకవు కాబట్టే ఏపీలో మాత్రం హైక్స్ తీసుకున్నామని అందులోని సింగిల్ స్క్రీన్ కి 50 రూపాయలు మాత్రమే పెంచుకున్నామని నాగవంశీ తెలిపారు. సో తక్కువ స్క్రీన్స్ కాబట్టి రెవెన్యూ బట్టి ఈ హైక్స్ తీసుకున్నారని అనుకోవచ్చు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
