అప్పుడు దీపికా.. ఇప్పుడు రాధికా.. అదే విషయంపై కామెంట్స్..!

Radhika-Apte

సూటిగా మాట్లాడే నటి రాధికా ఆప్టే సినిమా ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్‌పై తన స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించారు. వరుసగా రోజులు తరబడి పిల్లలను చూడకుండా పని చేయడం సరైంది కాదని, లాంగ్ షిఫ్ట్స్‌కు నో చెప్పినందుకు తాను ఎన్నో చర్చలు, వాదనలు ఎదుర్కొన్నానని అన్నారు.

పిల్లల కోసం నానీని పెట్టుకుని సెట్స్‌కు తీసుకురావడం అసలు పరిష్కారం కాదని రాధికా స్పష్టం చేశారు. పని-జీవిత సమతౌల్యం అవసరమని, అది లేకపోతే వ్యక్తిగత జీవితం దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఇకపై సినిమాలకు ఒప్పుకునే సమయంలో వర్కింగ్ అవర్స్ తనకు నాన్ నెగోషియబుల్ అని తెలిపారు. వారానికి ఐదు రోజులు పని, రోజుకు గరిష్టంగా 12 గంటల షిఫ్ట్, వీక్లీ ఆఫ్ తప్పనిసరి అని, అరుదైన సందర్భాల్లో మాత్రమే మినహాయింపులు ఉంటాయని చెప్పారు.

అయితే, గతంలో ఇదే విషయంపై దీపికా పదుకొనే కూడా తనదైన రీతిలో తన అభిప్రాయాలను వెల్లడించారు. కానీ, అవి ఆమెకు చేటుగా మారడం మనం చూశాం. మరి రాధికా కామెంట్స్ ఎలాంటి ఫలితాన్ని మిగిలిస్తాయో చూడాలి.

Exit mobile version