ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Vara Prasad Garu) కూడా ఒకటి. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకొని తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో కూడా సెన్సేషనల్ రన్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా4 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 190 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టినట్టు మేకర్స్ తెలిపారు. దీనితో మెగాస్టార్ విధ్వంసం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ కనుమ రోజు వసూళ్లతో ఈ సినిమా 200 కోట్ల మార్క్ ని కొట్టేసినట్టే అని చెప్పి తీరాలి. ఈజీగా ఈ కనుమ రోజున మరో 30 కోట్లయినా మినిమం లో మినిమం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ సినిమా 5 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ ని దాటేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో అనేది చూడాలి.
