మెగా హీరో కొరియన్ కామెడీ గ్లింప్స్ కి డేట్ ఫిక్స్!

VT15

మెగా కుటుంబం నుంచి ఉన్నటువంటి టాలెంటెడ్ హీరోస్ లో ప్రతీ సినిమాకి ఏదొక కొత్తదనాన్ని ట్రై చేస్తూ వస్తున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అనే చెప్పాలి. అలా తన ట్రాక్ రికార్డులో జయాపజయాలతో సంబంధం లేకుండా లేటెస్ట్ గా చేస్తున్న మరో కొత్త సబ్జెక్టు కొరియన్, హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. తన కెరీర్ 15వ సినిమాగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ టైటిల్ గ్లింప్స్ కి ఇప్పుడు డేట్ ఫిక్స్ చేశారు.

ఈ జనవరి 19న ఈ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా కమెడియన్ సత్య తదితరులు నటిస్తున్నారు. అలాగే ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో కూడా మేకర్స్ ఈ చిత్రాన్ని తీసుకెళ్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండడం విశేషం కాగా భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version