మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) సినిమా సంక్రాంతికి స్పెషల్ గా విడుదలైంది. ఈ సినిమాకు థియేటర్లలో అద్భుతమైన ఓపెనింగ్స్ లభించాయి, పైగా ఇంకా రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది, దీనికితోడు సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు చిత్ర బృందం, సినిమా విడుదల తర్వాత కూడా ఆఫ్-లైన్ ప్రమోషన్లను చేపట్టింది. ఈ రోజు చిత్ర బృందం ఏలూరు, గణపవరం, తణుకు, రావులపాలెం మరియు రాజమండ్రిలోని కొన్ని థియేటర్లను సందర్శించనుంది.
కాగా ఈ ప్రమోషన్స్ సినిమాకు మరింత ప్రచారం కల్పించనున్నాయి. అన్నట్టు చిత్రబృందం రాకతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఇంకా బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి అనిల్ రావిపూడి ఫుల్ వినోదాత్మక చిత్రాన్ని అందించారు, ఇందులో చిరంజీవి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు, పాటలు మరియు మాస్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.
