మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రకటించిన దగ్గరనుండి ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా, తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు ఓ చిన్న బ్రేక్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ బ్రేక్‌కు కారణం హీరో ఎన్టీఆర్ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ కాస్త జలుబుతో బాధపడుతున్నాడని.. అందుకే ప్రశాంత్ నీల్ చిత్ర షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా రాత్రి సమయంలో ఈ షూటింగ్ నిర్వహిస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
తొలుత 2026 జనవరి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించినా, ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా అందాల భామ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
