మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసిన బ్యూటీ.. వచ్చే సంక్రాంతి కూడా అమ్మడిదే..!

Ashika Ranganath

అందాల భామ ఆషిక రంగనాథ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవల సంక్రాంతి బరిలో మాస్ రాజా రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాలో నటించిన ఆమెకు ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో బూస్ట్ లభించింది. అయితే, గతంలోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయమైనా సరైన హిట్ మాత్రం పడలేదు.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’లో కూడా ఈ కన్నడ బ్యూటీ నటిస్తోంది. అయితే, ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్న ఈ భామ, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను దర్శకుడు శ్రీను వైట్ల డైరెక్షన్‌లో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆషిక రంగనాథ్‌ను మేకర్స్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. శర్వా పక్కన ఆమె కెమిస్ట్రీ బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించి ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2026 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకున్న ఆషిక, మరోసారి 2027 సంక్రాంతికి కూడా సందడి చేయనుండటం విశేషం.

Exit mobile version