యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ నుంచి రానున్న పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న అవైటెడ్ ప్రీక్వెల్ చిత్రం ‘ఓజి 2’ కూడా ఒకటి. దీనిపై నెలకొన్న హైప్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే దీనితో పాటుగా నాచురల్ స్టార్ నాని హీరోగా ‘బ్లడీ రోమియో’ అనే క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్ ని కూడా తాను సిద్ధం చేస్తున్నాడు. అయితే ఇటీవల గ్యాప్ లో నాని సినిమా కంటే ముందే పవన్ తో సినిమా మొదలు కానున్నట్టు పరిస్థితులు మారాయి.
ఈ నవంబర్ నుంచే సినిమా మొదలు అని కూడా గట్టి టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఓజి 2 కి బ్రేక్ పడి బ్లడీ రోమియో ట్రాక్ లోకి వచ్చాడని తెలుస్తుంది. నాని సినిమా షూట్ ఈ అక్టోబర్ నుంచే మొదలు కానున్నట్టుగా టాక్. సో దీనిపై అసలు క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఆల్రెడీ నానితో మంచి హిట్ కొట్టిన శ్యామ్ సింగ రాయ్ మేకర్స్ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు.
