‘ఈ నగరానికి ఏమైంది 2’ గ్యాంగ్ నుంచి ఈ నటుడు బయటకి?

ENE

ప్రెజెంట్ తెలుగు యువ జెనరేషన్ లో ఒక క్లాసిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా అంతా “ఈ నగరానికి ఏమైంది” అనే చెప్తారు. విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఇప్పుడు సిద్ధం అవుతుండగా ఒక ఊహించని ట్విస్ట్ సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.

అసలు ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో విశ్వక్ సేన్ అండ్ గ్యాంగ్ నే హైలైట్ అందులో ప్రతీ నటుడు తమదైన ముద్ర వేశారు. మరి ఇలాంటి ఈ నలుగురు గ్యాంగ్ లో పార్ట్ 2 లో ఒక నటుడు అయితే కనిపించబోడు అని టాక్ మొదలైంది. ఈ సినిమాలో కార్తీక్ గా నటించిన సాయి సుశాంత్ పార్ట్ 2లో లేదు అన్నట్టుగా తనకి రీప్లేస్ గా మరో నటుడు కనిపిస్తాడు అంటూ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ నటుడు ఎవరు అనేది అధికారికంగా రివీల్ కావాల్సి ఉంది.

Exit mobile version