‘అన్నగారు వస్తారు..’ ఇక లేనట్టేనా.. నేరుగా అక్కడికేనా..?

Annagaru-Vostharu

తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వా వాతియార్’ తమిళంలో ఇటీవల రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమాను డిసెంబర్ 2025లోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇక తమిళనాట ఈ చిత్రాన్ని పొంగల్ బరిలో రిలీజ్ చేశారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ చూసి సినిమాలో ఏదో కొత్త అంశం ఉండి ఉంటుందని ప్రేక్షకులు భావించారు.

దర్శకుడు నలన్ కుమారస్వామి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం, అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించడంతో ఈ సినిమాపై కొంతమేర బజ్ ఏర్పడింది. కట్ చేస్తే.. ఈ చిత్రం రిలీజ్ తర్వాత ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఎలాంటి ఎంటర్‌టైనింగ్ అంశాలు లేకపోవడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో తమిళనాట ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. అయితే, ఈ చిత్రాన్ని ‘అన్నగారు వస్తారు’(Annagaru Vostharu) అనే టైటిల్‌తో తెలుగులోనూ ప్రకటించారు.

కానీ, సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ కావడంతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు. అయితే, ఇప్పుడు తమిళంలోనే ఈ సినిమా డిజాస్టర్‌గా మిగలడంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ సినిమాను తెలుగు డబ్బింగ్‌లో నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ‘అన్నగారు వస్తారు’(Annagaru Vostharu) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగునాట థియేటర్లలోకి రావడానికే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Exit mobile version