విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘హ్యాపీ రాజ్’ ప్రోమో విడుదల

2 2

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘హ్యాపీ రాజ్’ చిత్ర తెలుగు ప్రోమో విడుదలైంది. బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జయవర్ధన్ నిర్మిస్తున్న ఈ ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌కు మారియా ఎలాంచెజియన్ దర్శకత్వం వహిస్తున్నారు. వినూత్నమైన టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం, తాజా ప్రోమోతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

రిఫ్రెషింగ్ విజువల్స్, ఆహ్లాదకరమైన వినోదంతో సాగిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్ కుమార్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా, శ్రీ గౌరి ప్రియా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విశేషమేమిటంటే, చాలా కాలం తర్వాత నటుడు అబ్బాస్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. జార్జ్ మరియం, ప్రార్థనా తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, మధన్ క్రిస్టఫర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version