ఓటిటిలోకి ధనుష్ హిందీ సినిమా తెలుగులో కూడా.. ఎప్పుడు నుంచంటే!

Tere-Ishk-Mein

తమిళ స్టార్ అండ్ వెర్సటైల్ హీరోస్ లో ధనుష్ కూడా ఒకరు. మరి ధనుష్ నుంచి ఇటీవల వచ్చిన చిత్రాల్లో బాలీవుడ్ హిట్ చిత్రం ‘తేరే ఇష్క్ మే'(Tere Ishk Mein) కూడా ఒకటి. దర్శకుడు ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ చిత్రం మంచి హిట్ అయ్యి బాలీవుడ్ లో ధనుష్ కి మరో 100 కోట్ల గ్రాసర్ గా నిలిచింది.

మరి ఈ సినిమా తెలుగులో ‘అమర కావ్యం’గా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది కానీ సరైన ప్రమోషన్స్ లేక ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. మరి ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చింది. రేపు జనవరి 23 నుంచి ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది అని ఇది వరకే కన్ఫర్మ్ చేశారు.

అయితే ఇప్పుడు ఏయే భాషల్లో ఉంటుంది అనేది కూడా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఒరిజినల్ హిందీ సహా డబ్బింగ్ భాషలు తెలుగు, తమిళ్ లో కూడా ఉంటాయని రివీల్ చేశారు. సో అప్పుడు ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు చూడొచ్చు. అలాగే ఓటిటిలోకి వచ్చాక ఈ సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version