The Raja Saab: ‘రాజా సాబ్’ ఓటిటి డేట్ ఫిక్స్? ఇంత ముందుగానా?

The Raja Saab

ఇటీవల సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “ది రాజా సాబ్” (The Raja Saab) కూడా ఒకటి. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ చిత్రంగా వచ్చిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. అయినప్పటికీ 200 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో దాదాపు రన్ ని ముగించుకుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయినట్టు తెలుస్తుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దగ్గర రాజా సాబ్ హక్కులు..

ప్రభాస్ ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి ఓటిటి (The Raja Saab OTT) డీల్ కొంచెం ఆలస్యం అయ్యింది. కానీ ఫైనల్ గా జియో హాట్ స్టార్ వారు ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోగా ఇప్పుడు డేట్ ని అయితే లాక్ చేసినట్టు వినిపిస్తుంది.

ఫిబ్రవరి మొదటి వారంలోనే రాజా సాబ్ రాక?

ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాలు ప్రకారం రాజా సాబ్ (Prabhas Raja Saab) ఓటిటి డేట్ గా హాట్ స్టార్ వారు ఈ ఫిబ్రవరి 6 కి లాక్ చేసినట్టు వినిపిస్తుంది. మొత్తం పాన్ ఇండియా భాషల్లోనే ఆరోజున వచ్చేస్తుందట. సో నెల తిరక్కుండానే ఈ సినిమా ఓటిటిలో ఉంటుందని చెప్పొచ్చు.

ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా నటించగా దర్శకుడు మారుతీ తెరకెక్కించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version