ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జనవరి 28, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : కార్తీ, కృతి శెట్టి, సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్ మరియు ఇతరలు.
దర్శకత్వం : నలన్ కుమారసామి
నిర్మాత : కె.ఇ. జ్ఞానవేల్ రాజా
సంగీతం : సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ : జార్జ్ సి. విలియమ్స్ ఐ.ఎస్.సి
ఎడిటింగ్ : జార్జ్ సి. విలియమ్స్ ఐ.ఎస్.సి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే ‘వా వాథియర్’. దీనినే తెలుగులో ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vostaru) గా కూడా డబ్బింగ్ చేసారు కానీ తెలుగులో ఈ చిత్రం రిలీజ్ కాలేదు. అయితే కేవలం 14 రోజుల్లోనే నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలోనే తెలుగులో వచ్చేసిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
Annagaru Vostaru Story కథ:
సరిగ్గా సీనియర్ ఎన్టీఆర్ కన్నుమూసిన సమయంలోనే రాము రామారావు (కార్తీ) తాత (కిరణ్ రాజ్) కూడా పుడతాడు. దీనితో ఎన్టీఆర్ కి వీరాభిమాని అయ్యిన తన తాత (రాజ్ కిరణ్) అన్నగారే మళ్ళీ పుట్టారు అని తన మనవడిని ఎన్టీఆర్ లానే పెంచడం మొదలు పెడతాడు. కానీ ఒక్క సంఘటనతో రాము తన మనసు మార్చుకొని హీరోగా కాకుండా విలన్ గా బతకడం మొదలు పెడతాడు. అలా ఇన్స్పెక్టర్ అయ్యిన రాముకి ఏమవుతుంది? ఈ క్రమంలో పాలిటిక్స్ వేలు పెడుతున్న పేరు మోసిన బిజినెస్ మెన్ భక్తవత్సలం (సత్యరాజ్) పాలిటిక్స్, యూట్యూబర్, ఒక తాంత్రికురాలు వూ (కృతి శెట్టి), పసుపు ముఖం గా పిలవబడే (గ్రూప్ హ్యాకర్స్) ల పాత్రలు ఏంటి? అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో కనిపించే ఇంట్రెస్టింగ్ ఐడియా చూసే ఆడియెన్స్ లో ఒకరకమైన అటెన్షన్ ని అందుకుంటుంది. అలాంటి ధృవ తార ఆత్మగా మళ్ళీ తిరిగి వస్తే.. అక్కడ నుంచి చేసే సాహసాలు లాంటివి ఒకింత ఎంటర్టైనింగ్ యాంగిల్ ఇందులో బాగానే అనిపిస్తాయి.
మెయిన్ గా కార్తీ నటన అందులో వేరియేషన్స్ బాగున్నాయి. ఒక పోలీస్ గా డిఫరెంట్ యాటిట్యూడ్, ఇంకోపక్క అన్నగారిలా సెటిల్డ్ నటన తాను కనబరిచాడు అని చెప్పాలి. అలాగే ఫస్టాఫ్ లో కథనం కూడా ఒకింత నీట్ గానే వెళుతుంది. కృతి శెట్టి పాత్ర ఆమె పరిచయం ఆసక్తి రేపుతాయి. అంతే కాకుండా కొన్ని కామెడీ సీన్స్ కూడా డీసెంట్ ఫన్ ని జెనరేట్ చేస్తాయి.
మైనస్ పాయింట్స్:
కేవలం కాన్సెప్ట్ ఒకటే సినిమాని సేవ్ చేయడం అనేది కష్టం. ఈ సినిమాలో కాన్సెప్ట్ డీసెంట్ గానే ఉంది కానీ దానికి అనుగుణంగా డిజైన్ చేసుకున్న కథనం చూసే ఆడియెన్ కి బాగా రొటీన్ ఫీల్ నే కలిగిస్తుంది. ఒక ఇన్సిడెంట్ తో మంచి హీరో చెడుగా మారిపోవడం లాంటి టెంప్లేట్ లు కోకొల్లలుగా చూసేసాం. అలాగే ఈ సినిమాలో సెకండాఫ్ కూడా వీక్ గా ఉందని చెప్పాలి.
మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్లాక్ వచ్చిన తర్వాత సినిమాలో సెకండాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అని ఫీల్ అవ్వొచ్చు. కానీ అనూహ్యంగా సెకండాఫ్ లో ఇలాంటివి ఏమి లేకుండా పరమ రొటీన్ గా కథనం సాగిపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కార్తీ తప్పితే మిగతా ఏ పాత్రలు కూడా ఇంట స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపించదు. కృతి శెట్టి రోల్ వేస్ట్ అయ్యింది.
అలాగే సత్యరాజ్ కి కూడా స్కోప్ లేకుండా పోయింది. ఇక వీటితో పాటుగా ఓటిటిలో ఈ సినిమా చూసే తెలుగు ఆడియెన్స్ పూర్తి స్థాయిలో ఈ సినిమాకి కనెక్ట్ కావడం కూడా కష్టమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే తెలుగులో మేకర్స్ ఆల్రెడీ సెపరేట్ వెర్షన్ ని ప్రిపేర్ చేశారు కానీ ప్రైమ్ వీడియోలో మాత్రం తమిళ్ వెర్షన్ వీడియోకే తెలుగు వెర్షన్ డబ్బింగ్ పెట్టేసారు.
అక్కడ అన్నగారు అంటే తమిళ దివంగత నటుడు ఎంజీఆర్ ని చూపిస్తారు కానీ మనం వినడం ఎన్టీఆర్ అని ఉంటుంది. సో ఇవి పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. కొన్ని సాధారణ సినిమాలకి ఇలా భాషలు మార్చుకోవడం అంటే ఓకే అనుకోవచ్చు కానీ ఈ సినిమాపై మినిమమ్ ఒక ఐడియా ఉంది. అయినప్పటికీ ఇలాంటి కేర్ ని తీసుకోకుండా మిస్ చేశారు.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా డిజైన్ చేసిన సెటప్ అంతా నీట్ గా కుదిరింది. అలాగే సంతోష్ నారాయణన్ మ్యూజిక్ మాత్రం తన లెవెల్లో అనిపించలేదు. కొన్ని చోట్ల స్కోర్ ఓకే కానీ ఓవరాల్ గా మాత్రం తన వర్క్ మెప్పించదు. జార్జ్ సి విలియం కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది.
ఇక దర్శకుడు నలన్ కుమారస్వామి విషయానికి వస్తే.. తను మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ నే తీసుకున్నాడు కానీ కథనంని మాత్రం ఎంగేజింగ్ గా మార్చడంలో విఫలం అయ్యారు. డల్ మూమెంట్స్ తో రొటీన్ గా సాగే కథనం ఇందులో మైనస్ గా మారింది. బహుశా ఇందుకే కోలీవుడ్ ఆడియెన్స్ లో కూడా తన వర్క్ ఇంప్రెస్ చేయలేకపోయింది. తాను మరే ఇతర వెర్షన్ ని అయినా స్క్రీన్ ప్లే గా ట్రై చేయాల్సింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vostaru) ఆడియెన్స్ ని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ఐడియా బాగానే ఉంది కానీ దీనిని బెటర్ గా తెరకెక్కించాల్సింది. కార్తీ తన వల్ల అయ్యింది అంతా చేసాడు కానీ వీక్ కథనం సినిమా మొత్తం ఫలితాన్ని మార్చేసింది. సో కార్తీ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయాడు. పైగా తెలుగు ఆడియెన్స్ కి పూర్తి స్థాయిలో కనెక్ట్ కావడం కూడా కష్టమే.. సో ఈ చిత్రాన్ని మరీ ఎలా ఉన్నా సరే అప్పుడు మిస్ అయ్యాము చూడాల్సిందే అనుకునేవారు చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని చూస్తే మంచిది లేకపోతే, మీ సమయం, డేటాని మరో సినిమా లేదా సిరీస్ కి కేటాయించుకుంటే బెటర్.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
