టాలీవుడ్లో హిట్ ఫ్రాంచైజీ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శైలేష్ కొలను. పూర్తి క్రైమ్ అండ్ థ్రిల్లర్ సబ్జెక్టులను తనదైన రీతిలో ఎంగేజింగ్‌గా మిలిచి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్స్ అందుకున్నాడు. ఇక ‘హిట్-3’ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌ను చూశాడు ఈ డైరెక్టర్.
అయితే, బ్యాక్ టు బ్యాక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను రూపొందించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు తన రూటు మార్చేందుకు నిర్ణయించుకున్నాడు. తన నెక్స్ట్ చిత్రం కోసం తన జోనర్ మార్చుతున్నట్లు ఆయన హింట్ ఇచ్చాడు. ఇక తాను రొమాంటిక్ కథను ప్రేక్షకులకు వివరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు.
దీంతో శైలేష్ కొలను ఒక్కసారిగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ వదిలి ఎలాంటి ప్రేమకథను వినిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక తన నెక్స్ట్ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించేందుకు ఈ క్రేజీ డైరెక్టర్ రెడీ అవుతున్నాడు.
