ఫోటో మూమెంట్ : అన్నవదినలతో కలిసి దుబాయ్ ట్రిప్‌లో అల్లు అర్జున్ వైరల్ ఫోటో!

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమాలు ప్రకటిస్తూ సందడి చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో నటిస్తు్న్న బన్నీ, సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో గడుపుతుంటాడు. ఆయన వెకేషన్‌లు కూడా వెళ్తూ తన ఫ్యామిలీకి క్వాలిటీ సమయాన్ని ఇస్తుంటాడు.

అయితే, తాజాగా అల్లు అర్జున్ తన అన్నయ్య అల్లు బాబీ మరియు వదిన నీలూ షాతో కలిసి దుబాయ్‌లో సందడి చేశాడు. తన షూటింగ్ షెడ్యూల్ నుండి చిన్న విరామం తీసుకున్న ఆయన, కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. సాధారణంగా సినిమాల్లో అత్యంత స్టైలిష్‌గా కనిపించే బన్నీ, ఈ ట్రిప్‌లోనూ తనదైన మేకోవర్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

ఇక ఈ ఫోటోలో అల్లు అర్జున్ వైట్ టీ-షర్ట్ మరియు బ్లాక్ షార్ట్స్‌ ధరించి చాలా కూల్‌గా, సింపుల్‌గా కనిపిస్తున్నాడు. ఆయన పక్కనే ఉన్న అల్లు బాబీ బ్లాక్ స్వెట్‌షర్ట్ మరియు వైట్ ప్యాంట్‌లో స్టైలిష్‌గా ఉండగా, నీలా షా ఎల్లో కలర్ డ్రెస్‌లో కనిపిస్తున్నారు. అల్లు బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధం ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version