‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga). ఇక ఆయన డైరెక్ట్ చేసిన ‘యానిమల్’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా 2023లో రిలీజ్ అయ్యి రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా డైరెక్టర్‌గా సాలిడ్ క్రేజ్ దక్కించుకున్నాడు.
ఇప్పుడు ఈ యానిమల్ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర జపాన్ ప్రమోషన్స్‌లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి యానిమల్ చిత్రానికి సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ ఉంటుందని.. ఈ చిత్రాన్ని 2027లో షూటింగ్ చేస్తామని.. 2028లో రిలీజ్ చేస్తామని ఆయన ధీమాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను ‘స్పిరిట్’ అనే సినిమాను రూపొందిస్తున్నామని.. ఆ సినిమా పూర్తయ్యాక ‘యానిమల్ పార్క్’ చేస్తామని ఆయన వెల్లడించారు. ఇక ఈ సినిమా తొలిభాగంతో పోలిస్తే, మరింత బోల్డ్ అండ్ వైల్డ్‌గా ఉండబోతుందని ఆయన తెలిపారు.
కాగా, యానిమల్ పార్క్ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించబోతున్నాడట. మొత్తానికి ‘యానిమల్ పార్క్’ మూవీపై సందీప్ రెడ్డి వంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నారనేది స్పష్టం అయింది.
