ట్రైలర్ టాక్: అనుదీప్ మార్క్ ఎంటర్టైనర్ గా ‘ఫంకీ’ ట్రీట్

Funky

మన టాలీవుడ్ యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు అనుదీప్ కే వి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే ఫంకీ. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ప్రామిస్ చేస్తూ వచ్చిన ఈ ట్రైలర్ నుంచి ఫైనల్ గా ట్రైలర్ కట్ ఇప్పుడు బయటకి వచ్చింది. మరి ఈ ట్రైలర్ మాత్రం మంచి ఫన్నీగా అనుదీప్ మార్క్ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది.

హాస్పిటల్ లో సర్జరీ డైలాగ్ తోనే అనుదీప్ తన మార్కు స్మూత్ కామెడీ స్టార్ట్ చేసాడు. అక్కడ నుంచి నాన్ స్టాప్ ఫన్ తో ఈ ట్రైలర్ బాగా సాగింది. ఇక ఒక యువ దర్శకుడుగా విశ్వక్ సేన్ తన హీరోయిన్ గా కయాదు తమ రోల్స్ లో అనుదీప్ పాత్రల బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నారు. ఇక ఇందులో భీమ్స్ స్కోర్ కూడా సినిమాలో ఫన్ టోన్ ని మ్యాచ్ చేస్తూ వినిపిస్తోంది.

మొత్తానికి అయితే ఈ రానున్న వారంలో మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ని ఫంకీ ప్రామిస్ చేస్తుంది. సో ఈ సినిమాతో కూడా మరో ఎంటర్టైనర్ ని అందించి వరుసగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ వారు అనగనగా ఒక రాజు సక్సెస్ తర్వాత సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తారో లేదో చూడాలి.

Exit mobile version