పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేసిన అవైటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి దగ్గరలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి కలయికలో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా ఓ ఊహించని బజ్ సోషల్ మీడియాలలో సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో వచ్చేస్తుంది అని అంతే కాకుండా జనవరి 12న అంటూ డేట్ కూడా ఒకటి వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమా రూమర్ పై లేటెస్ట్ క్లారిటీ ఒకటి వినిపిస్తోంది. దీని ప్రకారం ఆ రూమర్ లో ఎలాంటి నిజం లేదట. ప్రస్తుతానికి ఇంకా స్క్రిప్ట్ డెవలప్మెంట్ లు మాత్రమే జరుగుతున్నాయి అని వినికిడి. ఒక్కసారి స్క్రిప్ట్ మొత్తం పక్కాగా పూర్తయ్యాకే ఈ సినిమా మొదలై అప్పుడు రిలీజ్ ఎప్పుడు అనే ఆలోచనలు ఉంటాయట. సో ప్రస్తుతం వైరల్ అవుతున్న డేట్స్ లో ఎలాంటి నిజం లేదనే అనుకోవాలి.
