ఓటీటీ అలర్ట్ : ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఈషా’.. కానీ పెద్ద ట్విస్ట్..!

Eesha tel

2025లో భారీ అంచనాల మధ్య విడుదలైన తెలుగు హారర్ చిత్రం ‘ఈషా’, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, ప్రమోషన్స్ పరంగా సందడి చేసినప్పటికీ కంటెంట్ విషయంలో యావరేజ్ టాక్‌ను మూటగట్టుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రం థియేట్రికల్ విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం ఓవర్సీస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా రెంటల్ పద్ధతిలో ఉండటం గమనార్హం.

ఇక ఇండియన్ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.ఆర్.ధ్రువన్ సంగీతం అందించాడు. ఓటీటీ ఆడియన్స్ ఈ హారర్ థ్రిల్లర్‌ను ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version